ఇరుముడి 2 డేస్ కలెక్షన్స్
Irumudi 2 days collections
మాస్ మహారాజ్ రవితేజ ఒక్కసారిగా ఇరుముడి తో బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఘోర పరాజయాల తర్వాత ఇరుముడి తో రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇరుముడిని ప్రమోట్ చేసిన విధానమే ఆ సినిమాకి అంత భారీగా ఓపెనింగ్స్ రావడానికి కారణమయ్యాయి. రవితేజ పరాజయాలను పట్టించుకోకుండా ఇరుముడి చూసేందుకు ఆడియన్స్ క్యూ కట్టారు.
వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. శివ నిర్వాణ రవితేజకు కెరీర్ బెస్ట్ ఇచ్చాడు. రవితేజ యాక్టింగ్, తండ్రి-కూతురు మధ్యన నడిచిన ఎమోషనల్ బాండింగ్, శివ నిర్వాణ రైటింగ్, మేకింగ్, జీవి ప్రకాష్ మ్యూజిక్, అన్నిఇరుముడిని బెస్ట్ గా నిలపడంలో దోహదపడ్డాయి. మొదటి రోజు ఇరుముడి తో రూ.30 కోట్లు ఓపెనింగ్స్ కోలలగొట్టారు రవితేజ.
రెండో రోజు వరల్డ్ వైడ్ గా రూ.65.5 కోట్ల గ్రాస్ తీసుకొచ్చినట్లుగా మేకర్స్ పోస్టర్ వేసి మరీ ప్రకటించారు. అంతేకాకుండా రెండు రోజుల్లోనే రవితేజ ఇరుముడి చిత్రం అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవడం గమనార్హం. ఈరోజు నుంచి నిర్మాతలకు ఇరుముడి లాభాలే లాభాలు.







































