అనిల్ రావిపూడి: ఆయనకే ఎలా సాధ్యం
Director Anil Ravipudi
సినిమాలను ఏళ్లతరబడి సెట్స్ పై ఉంచి అటు నిర్మాతలకు, ఇటు ప్రేక్షకులకు పరీక్షగా మారుతున్న దర్శకులున్న ఉన్న ఈ కాలంలొ ఆరు నెలల్లో సినిమాని కంప్లీట్ చేసి విడుదల చెయ్యడమే కాదు వాటిని సక్సెస్ చెయ్యడమే పనిగా పెట్టుకున్న ఏకైన దర్శకుడు అనిల్ రావిపూడి. సినిమా విడుదలయ్యాక ఆరు నెలలు రిలాక్స్ గా స్క్రిప్ట్ ఫినిష్ చేసి ప్రోపర్ గా పనిలోకి దిగుతారు.
అంతే స్పీడుగా సినిమా షూటింగ్ ఫినిష్ చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తారు. ఈ ఏడాది మన శంకర వరప్రసాద్ గారుతో బ్లాక్ బస్టర్ రిజల్ట్ ఇచ్చిన అనిల్ రావిపూడి ఆరు నెలలు ఆరామ్స్ గా పక్కా స్క్రిప్ట్ తో వెంకీ-కళ్యాణ్ రామ్ లతో కలిసి జనవరి 12 విడుదల అంటూ సినిమా స్టార్ట్ చేసి అప్పుడే ఫస్ట్ హాఫ్ లాక్ చేసారు.
సెకండ్ హాఫ్ లో మేజర్ సీన్స్ షూటింగ్ కూడా చేసేసారు. ఇది జీ తెలుగు డ్రామా జూనియర్స్ వేదికపై హీరో కళ్యాణ్ రామ్ బయటపెట్టారు.
అన్నట్టు సినిమా మొదలయ్యాక కిందా మీద పడిపోయి సినిమా సెట్ లోని నిద్ర పోకుండా కూల్ గా షూటింగ్ చేస్తూ బుల్లితెరపై కొన్ని షోస్ కి జెడ్జి గా వస్తున్న అనిల్ రావిపూడి అలుపు లేకుండా షూటింగ్ చేసేసి మళ్లీ కలిసొచ్చిన సంక్రాంతికి జనవరి 12 విడుదల సినిమాని విడుదల చెయ్యడం మాత్రం మాములు విషయం కాదు.
నిజంగా ఇది కేవలం అంటే కేవలం అనిల్ రావిపూడి కే సాధ్యం. సినిమా షూటింగ్ తో పాటుగా ప్రమోషన్స్ ని కూడా వెరైటీ గా చేసే ఏకైక దర్శకుడు అనిల్ రావిపూడి నే.







































