టాక్సిక్ టీమ్ పై పోలీస్ కేసు
Police case against Toxic team
నిన్న శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని మల్లారెడ్డి కాలేజ్ లో జరిగిన టాక్సిక్ ఈవెంట్ లో సౌండ్ బాక్స్ లు పెట్టిన స్టాండ్ పైకి ఎక్కిన విద్యార్థులు.. ఆ స్టాండ్ పైనుంచి దురదృష్టవశాత్తు పడిపోవడంతో ప్రమారం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో గాయాపడిన విద్యార్థులకు చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తుంది.
అంతేకాకుండా టాక్సిక్ ఈవెంట్ లో విద్యార్థుల తొక్కిసలాట కారణంగా పలువురికి గాయాల కావడంతో పోలీసులు మల్లారెడ్డి కాలేజ్ పై కేసు నమోదు చేసారు. అంతేకాకుండా ఘటనకు కారణమైన టాక్సిక్ టీంపై, ఈవెంట్ మేనేజర్ పై కూడా పోలీసులు కేసు నమోదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
టాక్సిక్ చిత్రం రేపు బుధవారమే విడుదల కాబోతుంది. ఈ చిత్రాన్ని హీరో యష్ అండ్ టీం పాన్ ఇండియా మార్కెట్ లో ప్రమోట్ చేస్తున్నారు. అందులో భాగంగానే మల్లారెడ్డి కాలేజ్ లో టాక్సిక్ ప్రమోమోషనల్ ఈవెంట్ ను పెద్ద ఎత్తున నిర్వహించగా అక్కడ కొన్ని కొన్నిప్రమాదాలు చోటు చేసుకోవడంతో కేసు నమోదు చేసారు.







































