ప్రథమార్ధం తర్వాత బిగ్ హిట్ ఇదే

Ravi Teja IrumudiRavi Teja Irumudi

 

సంక్రాంతికి వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు, అనగనగ ఒకరాజు తర్వాత చాలా సినిమాలు విడుదలయ్యాయి. కానీ సంక్రాంతి సినిమాల అంత హిట్ కాలేదు. మధ్యలో తమిళ సినిమాలు వచ్చాయి అందులో తెలుగు బాక్సాఫీసు దగ్గర కొన్ని హిట్స్ అయ్యాయి. ఇక జూన్ తర్వాత వచ్చిన పెద్ది మిక్స్డ్ టాక్, మా ఇంటి బంగారం, లెనిన్ అన్ని హిట్ అయినా...

ఇప్పుడు రవితేజ ఇరుముడి చిత్రం మాదిరి ఆడియన్స్ నుంచి క్రిటిక్స్ నుంచి ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకోలేదు. విశ్వనాథ్ అండ్ సన్స్ కి అలాంటి టాక్ వచ్చినా అది తమిళంలో తెరకెక్కిన సినిమా. సో ప్రథమార్ధం తర్వాత రవితేజ ఇరుముడినే పెద్ద హిట్ అని చెప్పాలి.

రవితేజ ఇరుముడి చిత్రంతో ఆయన కెరీర్ లోనే బిగ్ ఓపెనింగ్స్ దక్కించుకున్నారు. వరస ప్లాప్స్ లో ఉన్న రవితేజ ఇరుముడి తో మొదటి రోజు రూ.30 కోట్ల గ్రాస్ తేవడం నిజంగా ఆశ్చర్యకర విషయమే. ఇరుముడి చిత్రం కేవలం వీకెండ్ లోనే రూ.100 కోట్ల బొమ్మ కావడం కన్ ఫర్మ్.

సో ప్రథమార్ధం తర్వాత సెకండ్ హాఫ్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇరుముడి చిత్రం అనే చెప్పాలి. మరి ఇరుముడి తో రవితేజ కలెక్షన్స్ రిపోర్ట్ ఎలా ఉండబోతుందో అనేది ఇప్పుడు అందరిలో క్యూరియాసిటీ మొదలయ్యేలా చేసింది. 
 

Ravi Teja Irumudi