మతిపోగొడుతున్న కియారా అద్వానీ
Kiara Advani Serves Classic Glamou
బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ ప్రస్తుతం టాక్సిక్ ప్రమోషన్స్ లో గ్లామర్ షో చేస్తూ మతిపోగొడుతోంది. యశ్ హీరోగా, నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తార సుతారియా నటించిన టాక్సిక్ ప్యాన్ ఇండియా మూవీ రేపు 26 న విడుదల కాబోతుంది. పాన్ ఇండియా మార్కెట్ లో టాక్సిక్ ని తెగ ప్రమోట్ చేస్తున్నారు.
సినిమాలోనే బోల్డ్ కేరెక్టర్ లో కనిపిస్తున్న కియారా అద్వానీ ప్రమోషన్స్ లోను అంతకుమించిన గ్లామర్ తో యూత్ ని పడేస్తుంది. బెంగుళూరు ఈవెంట్ దగ్గర నుంచి నిన్న హైదరాబాద్ లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ లో జరిగిన ఈవెంట్ వరకు కియారా గ్లామర్ షో గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.
తాజాగా కియారా బ్లాక్ మోడ్రెన్ లుక్ మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. టాక్సిక్ ఈవెంట్ లో కియారా అందాలు చూసి యూత్ మైమరిచిపోతున్నారు, ఆమె లుక్ చూసి మతిపోగొట్టేశావ్ కియారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.







































