విశ్వంభర - ఇంకా క్లారిటీ లేకపోతె ఎలా
Vishwambhara release date update
దర్శకుడు వసిష్ఠ విశ్వంభర విడుదల విషయంలో క్లారిటీ ఇవ్వకుండా విశ్వంభర ఎప్పుడు వచ్చినా బాక్సాఫీసు బద్దలైపోతుంది అంటూ బిల్డప్ ఇవ్వడం చూసి మెగా ఫ్యాన్స్ సంతోషపడాల్సిందిపోయి వశిష్ట పై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. చిరు బర్త్ డే కి విశ్వంభర OST వదిలి ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసినా.. అభిమానుల్లో మాత్రం అసహనం మిగిలే ఉంది.
సినిమా షూటింగ్ ఫినిష్ అయ్యి రెండేళ్లయినా ఇంకా విడుదల క్లారిటీ లేకపోడం పై సోషల్ మీడియాలో పడుతున్న కామెంట్స్ ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతున్నాయి. ఆ కోపంతోనే వశిష్ట పై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. చిరు బర్త్ డే కి కచ్చితంగా విశ్వంభర విడుదల తేదీ వస్తుందని ఆశపడిన వారిని వశిష్ట డిజప్పాయింట్ చేశారు.
మరి సీజీ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదా, లేదంటే విశ్వంభర కి ఏదైనా సమస్యా.. దసరా విడుదల ఉండొచ్చుఅన్నారు, కానీ అది అయ్యేలా లేదు. మరి ఈ ఏడాది విశ్వంభర విడుదల ఉంటుందా వశిష్టా.. అదే మెగా ఫ్యాన్స్ ప్రశ్న. చూద్దాం వసిష్ట ఏం చేయబోతున్నారో అనేది.







































