సూర్య కి ఇబ్బందే
Vishwanath and Sons
నిజమే సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రానికి ఇక తెలుగులో ఇబ్బందే. కారణం రవితేజ ఇరుముడి. రవితేజ ఇరుముడి ఈ శుక్రవారం విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఎన్నో ఏళ్లుగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న రవితేజ కు ఇరుముడి రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ దొరికింది.
గత వారం విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని థియేటర్స్ లో అద్భుతంగా రన్ అవుతున్న సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం దూకుడు కి ఇరుముడి అడ్డు కట్ట వేస్తుందా అనే అనుమానం ఇప్పుడు నిజమైంది. విశ్వనాథ్ అండ్ సన్స్ కి ఇరుముడి అడ్డుకట్టవేసేసింది. దానితో ఈ శుక్రవారం నుంచి విశ్వనాథ్ కలెక్షన్స్ లో అనూహ్యంగా డ్రాప్ మొదలయ్యింది.
రవితేజ ఇరుముడి ఫ్యామిలీ ఎంటర్టైనర్, కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది, ఇరుముడి థియేటర్స్ లో ప్రేక్షకులు హారతులు పడుతున్నారు, శివ నిర్వాణ రైటింగ్ కి, రవితేజ యాక్టింగ్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇరుముడి ఊపులో ఇకపై సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ పరిస్థితి ఏమిటి అనేది చూడాలి.
మొదటిరోజు బిగ్ ఓపెనింగ్స్, రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ తో ఇరుముడి థియేటర్స్ లో సందడి చెయ్యడమే కాదు.. మేకర్స్ ఇంకా థియేటర్స్ యాడ్ చేస్తున్నారు, దానితో ఇరుముడి హవా లో సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ కొట్టుకుపోతుంది.















































