Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> All Eyes waiting for Vishwambhara Announcement

అందరి కళ్ళు విశ్వంభర అప్ డేట్ పైనే

All Eyes waiting for Vishwambhara Announcement


రేపే మెగాస్టార్ బర్త్ డే. ఆగష్టు 2 న చిరు బర్త్ డే. మరికొన్ని గంటల్లో చిరు బర్త్ డే వేడుకలు మొదలైపోతాయి. మరోపక్క చిరు-బాబీ కలయికలో తెరకెక్కుతున్న మెగా 158 టైటిల్ గ్లింప్స్ కి ముహూర్తం పెట్టేసారు. కానీ చిరు నటించిన విశ్వంభర సంగతేమిటి.

వశిష్ట విశ్వంభర నుంచి ఎలాంటి ట్రీట్ ఇస్తారో అని మెగా ఫ్యాన్స్ ఆశపడుతూ ఎదురు చూస్తున్నా, మరోపక్క ఎక్కడో చిన్న అనుమానం. చిరు బర్త్ డేకయినా విశ్వంభర అప్ డేట్ వుంటుందా, ఉండదా అనేది. మరి వశిష్ట ఎలాంటి హడావిడి లేకుండా బిగ్ సర్ ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేసారా...

ఆ సర్ ప్రైజ్ ని మెగా ఫ్యాన్స్ ఎంజాయ్ చెయ్యాలి, ఇలా విశ్వంభర పై హైప్ క్రియేట్ చెయ్యడమే కాకుండా తనపై ఇప్పటివరకు ఉన్న నెగిటివిటీ పోగొట్టుకోవాలనుకుంటున్నారేమో వశిష్ట.. ఏది ఏమైనా విశ్వంభర అప్ డేట్ కోసం మెగా ఫ్యాన్స్ కన్నా ఎక్కువగా సోషల్ మీడియా వెయిట్ చేస్తుంది.   

Vishwambhara update