చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ డేట్ ఫిక్స్

Chennai Love Story OTT Release Date Chennai Love Story OTT Release Date

 

కిరణ్ అబ్బవరం లేటెస్ట్ హిట్ చిత్రం చెన్నై లవ్ స్టోరీ. రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన చెన్నై లవ్ స్టోరీ చిత్రం ఫస్ట్ హాఫ్ ఉన్నట్టుగా సెకండ్ హాఫ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా నిర్మాతలు చెప్పినట్టుగా కల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది.. సెకండ్ హాఫ్ వీక్ అవడంతో జస్ట్ సూపర్ హిట్ దగ్గరే ఆగిపోయింది అన్నారు ఆడియన్స్.

ఈ చిత్రం జులై 24 న థియేటర్స్ లో విడుదలైంది. థియేటర్స్ లో హిట్ అయిన చెన్నై లవ్ స్టోరీ ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తుందా అని ఫ్యామిలీ, ఓటీటీ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. చెన్నై లవ్ స్టోరీ డిజిటల్ హక్కులను ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ ఇప్పుడు ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ లోకి తేబోతుంది.

చెన్నై లవ్ స్టోరీ థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాలకే సోని లివ్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతుంది. అంటే ఆగష్టు 21 నుంచి చెన్నై లవ్ స్టోరీని సోని లివ్ ఓటీటీ సంస్థ స్ట్రీమింగ్ లోకి తెస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. 

Chennai Love Story To Stream In SonyLIV