ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Anupama Reveals Dulquer Salmaan and Ram Are Her Closest Friends

రామ్, దుల్క‌ర్ ఆ హీరోయిన్ అంత మంచి ఫ్రెండ్స్

Anupama Reveals Dulquer Salmaan and Ram Are Her Closest Friends

సినిమా రంగంలో సహనటుల మధ్య ఉండే అనుబంధం గురించి  అనుపమ పరమేశ్వరన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తాను మానసికంగా కృంగిపోయినప్పుడు ..కష్టాల్లో ఉన్నప్పుడు నటుడు దుల్కర్ సల్మాన్ తనకు అండగా నిలుస్తారని పేర్కొన్నారు. దుల్కర్ నుండి వచ్చే సందేశాలు తనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయని.. వారితో మాట్లాడిన తర్వాత తాను మళ్ళీ సాధారణ స్థితికి వ‌స్తాన‌ని తెలిపారు.

అలాగే  తెలుగు నటుడు రామ్ పోతినేని కూడా తనకు నమ్మకమైన వ్యక్తులలో ఒకరని అనుపమ వెల్లడించారు. క్లిష్ట సమయాల్లో త‌న  యోగక్షేమాలను అడిగి తెలుసుకునే మిత్రులు ఉండటం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.  ఇద్ద‌రు తనకు ఇచ్చే మానసిక మద్దతు వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలో ఎంతో ముఖ్యమైనవని  అభిప్రాయపడ్డారు.

వ్యక్తిగత జీవితంలో  ఎదుర్కొన్న నార్సిసిస్టిక్ దుర్వినియోగం గురించి కూడా ప్రస్తావించారు. అలాంటి వ్యక్తులు తమకు తాము అదుపులో లేని అభద్రతాభావంతో ఉంటారని.. ఇతరులను నియంత్రించాలని ప్రయత్నిస్తారన్నారు.  ఇలాంటి చేదు అనుభవాల నుండి బయటపడటంలో .. మానసికంగా దృఢంగా ఉండటంలో దుల్కర్, రామ్ వంటి నిజమైన స్నేహితుల ప్రోత్సాహం ఎంతో తోడ్పడుతుందని తెలిపారు.

Anupama Parameswaran Reveals Dulquer Salmaan and Ram Pothineni Are Her Closest Friends