అయ్యయ్యో దేవుడు మిస్ అయ్యాడే!
Pawan Kalyan missing Bandla Ganesh daughter wedding
పవన్ కళ్యాణ్ నా దేవుడు, నేను భక్తుడిని .. నన్ను ఆయనని విడగొట్టేందుకు కొంతమంది (త్రివిక్రమ్) ప్రయత్నిస్తున్నారంటూ ఒకప్పుడు బహిరంగంగా కామెంట్స్ చేసిన బండ్ల గణేష్ ఇంట శుభకార్యానికి ఇప్పుడు ఆ దేవుడే మిస్ అయ్యారు. అంటే బండ్ల గణేష్ దేవుడిలా ఆరాధించే పవన్ కళ్యాణ్ బండ్ల కుమార్తె జనని వివాహనికి హాజరు కాలేకపోయారు.
ఈరోజు జరిగిన బండ్ల గణేష్ కుమర్తె జనని వివాహానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ రాలేకపోయారు. ఆయన భార్య అన్న కొణిదెల బండ్ల కుమర్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కానీ దేవుడు పవన్ మాత్రం అనారోగ్య కారణాలతో రాలేకపోయారు.
అయితే బండ్ల గణేష్ ఇండైరెక్ట్ గా టార్గెట్ చేసే త్రివిక్రమ్ బండ్ల గణేష్ ఇంట శుభకార్యంలో కనిపించడం హాట్ టాపిక్ అయ్యింది. త్రివిక్రమ్ ఈ వివాహానికి హాజరయ్యారు. దానితో అందరూ షాకయ్యారు. పవన్ కళ్యాణ్ ని బండ్ల గణేష్ కలవకుండా త్రివిక్రమ్ చేస్తున్నారంటూ బండ్ల చాలాసార్లు ఆరోపించారు. అలాంటి బండ్ల త్రివిక్రమ్ ని ఆహ్వానించడం ఆయన ఈ వేడుకలో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.







































