ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> CM Chandrababu Attends Bandla Ganesh Daughter Wedding Ceremony

CBN చేతుల మీదుగా బండ్ల గణేష్ కుమర్తె వివాహం

CM Chandrababu Attends Bandla Ganesh Daughter Wedding Ceremony


ఈరోజు ఆదివారం ఆగష్టు 16న ప్రముఖ నిర్మాత కమ్ నటుడు బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. గత వారం రోజులుగా బండ్ల గణేష్ కుమార్తె ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుమార్తె జనని ఎంగేజ్మెంట్ ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతుల చేతుల మీదుగా జరిపించిన బండ్ల గణేష్ వివాహాన్ని కూడా ముఖ్యమంత్రి దంపతుల చేతుల మీదుగా జరిపించారు.

కుమార్తె పెళ్లి కి బండ్ల గణేష్ దంపతులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆహ్వానించడమే కాదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరు, నాగ్, వెంకీ ఇలా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి బండ్ల గణేష్ తన కుమార్తె జనని వివాహానికి ఆహ్వానించారు.

ఈరోజు జరిగిన బండ్ల గణేష్ కుమర్తె జనని వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరు దగ్గర నుంచి వెంకీ, నాగార్జున, నాగ చైతన్య, అలాగే ప్రముఖ డైరెక్టర్స్, రాజకీయ ప్రముఖులు, తెలంగాణ, ఆంధ్ర ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో పెళ్లి కుమారుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు-నారా భువనేశ్వరి చేతుల మీదుగా తాళి ని అందించారు.

చంద్రబాబు దంపతుల చేతుల మీదుగా తాళి అందుకున్న పెళ్లి కొడుకు జనని మెడలో మూడు ముళ్ళు వేసాడు. రెండురోజుల క్రితం జనని పెళ్లికూతురు వేడుకకు నారా భువనేశ్వరి హాజరయ్యారు. నేడు ఏపీ ముఖ్యమంత్రి దంపతుల చేతుల మీదుగా బండ్ల గణేష్ తన కుమార్తె జనని వివాహ వేడుకను అంగరంగ వైభవంగా జరిపించారు.

Bandla Ganesh Daughter Gets Married in Hyderabad