2 డేస్ లో రూ.100 కోట్ల విశ్వనాథ్
Vishwanath And Sons reaches a milestone
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ కలయికలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా గత శుక్రవారమే విడుదలైంది. విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రానికి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది.
ఆడియన్స్, క్రిటిక్స్ ఓవరాల్ గా విశ్వనాథ్ అండ్ సన్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ చూపించారు. సూర్య నటన, మమిత బైజు, రాధికా శరత్ కుమార్ ల యాక్టింగ్, జీవి ప్రకాష్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, వెంకీ అట్లూరి డైలాగ్స్ అన్ని సినిమాని ఆడియన్స్ కాదు కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యడం 100 శాతం సక్సెస్ అయ్యాయి.
ఆ పాజిటివ్ రెస్పాన్స్ తోనే విశ్వనాథ్ అండ్ సన్స్ కేవలం రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్ల కలెక్షన్స్ తీసుకొచ్చాయి. అంటే సూర్య జస్ట్ 2 డేస్ లోనే విశ్వనాథ్ అండ్ సన్స్ తో రూ.100 కోట్ల క్లబ్బులోకి అఫీషియల్ గా అడుగుపెట్టేసారు. మరి ఈ చిత్రం ఫైనల్ రన్ లో ఇంకెన్ని సెన్సేషనల్ నంబర్స్ నమోదు చేస్తుందో చూడాలి.







































