ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Faria Abdullah Breaks Down In Tears After Trolling

బోరున ఏడ్చేసిన ఫరియా అబ్దుల్లా

Faria Abdullah Breaks Down In Tears After Trolling


తెలుగు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియా ట్రోల్స్ పై స్పందిస్తూ బోరున ఏడ్చేయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. సోషల్ మీడియాలో ఫరియా అబ్దుల్లా పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆమె వివరణ ఇస్తూ కన్నీరు పెట్టుకుంది. అసలు ఫరియా అబ్దుల్లా అంతగా బాధపడడానికి కారణం ..

ఆమె రీసెంట్ గా జరిగిన బోనాల ఉత్సవాల్లో చక్కగా చీరకట్టుకుని అమ్మవారి బోనం ఎత్తడమే సోషల్ మీడియాకి టార్గెట్ అయ్యేలా చేసింది. ఎందుకంటే ఫరియా అబ్దుల్లా ముస్లిం అమ్మాయి. ముస్లిం అయ్యుండి బోనం ఎత్తిన ఫారియా పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ రావడంపైన ఆమె తాజాగా స్పందిస్తూ కన్నీటి పర్యంతమైంది.

తాను అమ్మవారికి బోనం ఎత్తడాన్ని విమర్శించారు, తన తండ్రి కన్వర్టెడ్ ముస్లిం అని, చిన్నప్పటి నుంచే తమ కుటుంబంలో అన్ని మతాలను గౌరవించే వాతావరణం ఉందని, ఏ మతాన్ని కూడా తక్కువగా చూడకుండా.. ప్రతి మతాన్ని గౌరవించడం తమకు చిన్నప్పటి నుంచే అలవాటైందని చెప్పింది.

తన ఫ్యామిలీ వివిధ మతాలకు సంబంధించిన పండుగలను, ఆచారాలను సమానమైన ప్రేమతో గౌరవిస్తుందని, తన దృష్టిలో మతం అనేది మనుషుల్ని విడదీయడానికి కాకుండా కలపడానికి ఉండాలని ఫరియా కళ్ళ నీళ్లతో వివరణ ఇచ్చింది. 

Faria Abdullah Gets Emotional After Facing Social Media Abuse