ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vishal's Makutam – Disaster Response

విశాల్ మకుటం - డిజాస్టర్ రెస్పాన్స్

Vishal's Makutam – Disaster ResponseVishal's Makutam – Disaster Response

 

కోలీవుడ్ హీరో విశాల్ కొన్నేళ్లుగా సక్సెస్ కోసం యుద్ధం చేస్తున్నారు. వరస సినిమాలు, షూటింగ్స్ అంటూ బిజీగా ఉంటున్నారు. కానీ హిట్ అనేది అందని పండుగా తయారైంది. డిటెక్టీవ్, సామాన్యుడు చిత్రాలు తర్వాత విశాల్ ఇంతవరకు హిట్ కొట్టిన సందర్భం లేదు. తెలుగులో ఆల్మోస్ట్ విశాల్ మర్కెట్ పడిపోయింది.

విశాల్ లేటెస్ట్ మూవీ మకుటం చిత్రానికి కనీసం ఓపెనింగ్స్ లేవు. తెలుగులోనే కాదు తమిళనాట కూడా మకుటం చిత్రానికి మినిమమ్ ఓపెనింగ్స్ లేవు అంటే విశాల్ మర్కెట్ ఎంతగా దిగజారిపోయిందో అర్ధమవుతుంది. సరే సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే రెండోరోజు మకుటం పరిస్థితి పుంజుకుంటుంది అనుకుంటే..

విశాల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మకుటం చిత్రానికి డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఆడియన్స్ మాత్రమే కాదు క్రిటిక్స్ కూడా మకుటం చిత్రానికి డిజాస్టర్ రెస్పాన్స్ చూపించారు. ఇక మకుటం చిత్రానికి మొదటిరోజు ఇండియా వైడ్ గా రూ 1 కోటి లోపే కలెక్షన్స్ నమోదు చెయ్యడం అందరికి ముఖ్యంగా విశాల్ కి షాకిచ్చింది.

మరి కథ, కథనాలు, దర్శకత్వం ఇవన్నీ ఆలోచించకుండా విశాల్ ఎడా పెడా సినిమాలు చేసినా ఏమి ఉపయోగం ఉండదు. ఇదిగో ఇలాంటి డిజాస్టర్ రెస్పాన్స్ చూడాల్సి వస్తుంది. 

Disastrous Opening For Magudam