పరువు తియ్యొద్దంటూ భార్యకు హీరో రిక్వెస్ట్
Govinda responds to wife Sunita amid feud
కొన్నాళ్లుగా బాలీవుడ్ నటుడు గోవిందాపై ఆయన భార్య సునీత తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. విభేదాలతో సతమతమవుతున్న ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. గోవిందా తనతో వర్క్ చేసిన హీరోయిన్స్ తో ఎఫ్ఫైర్స్ పెట్టుకున్నారంటూ సునీత పబ్లిక్ ప్లాట్ ఫామ్ లపైనే ఆరోపణలు చేస్తుంది.
తాజాగా మరోసారి సునీత తన భర్త గోవిందా ప్రస్తుతం రూప చిత్రంలో నటిస్తున్న కోమల్ రాణి స్వర్ణకార్ తో డేటింగ్ చేస్తున్నాడని, గోవిందా ఆ హీరోయిన్ తో సంబంధం పెట్టుకున్నాడంటూ చేసిన కామెంట్స్ పై నటుడు గోవిందా ఫైర్ అయ్యారు. తన పరువు తియ్యొద్దు అంటూ సీరియస్ గా భార్య సునీతకు వార్నింగ్ ఇచ్చారు.
చాలా ఏళ్ళ తర్వాత తానొక సినిమా చేస్తున్నాను అని, ఇలాంటి సమయంలో తన పరువు తీసేందుకు, నా అభిమానుల మద్దతు లేకుండా చేయడానికి మాత్రమే కాదు ఆమె ఈ సినిమాతో నేను నష్టపోయేలా చేయడానికి ప్రయత్నం చేస్తుంది.. సునీత ఫుడ్ షో చేస్తున్నప్పుడు నా సపోర్ట్ కోసం నన్ను ఆ కార్యక్రమానికి పిలిచింది, నేను వెళ్ళాను. అది తన హక్కు.
నేను చాలా రోజుల తర్వాత ఓ ప్రాజెక్టు స్టార్ట్ చేసిన సమయంలో ఇలాంటి కామెంట్లు చేయడం సరికాదు. నా గురించి తప్పుగా మాట్లాడుతూ వేరొకరిని ఇలా అవమానపరిచి, భయపెట్టి ఇండస్ట్రీ నుంచి బలవంతంగా వెళ్లిపోయేలా చేయొద్దు. నీ వెనుక ఓ గ్యాంగ్ ఉంది. వాళ్ల అండతో నువ్వు రెచ్చిపోయి మాట్లాడొద్దు. నీకు మళ్లీ నా మద్దతు అవసరమయ్యే రోజు రావొచ్చు.. సో కాస్త ఆలోచించుకో సునీతాజీ అంటూ గోవిందా భార్యని రిక్వెస్ట్ చేస్తూనే వార్న్ చేసారు.







































