ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Celebrity MasterChef to Tamil audiences with Samantha

సమంత రియాలిటీ షో ప్రోమో

Celebrity MasterChef to Tamil audiences with Samantha


మా ఇంటి బంగారం సక్సెస్ మాత్రమే కాదు అటు మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న సమంత యోగ, వర్కౌట్స్ ఇంకా భర్త రాజ్ నిడిమోరు తో కలిసి వెకేషన్స్ అంటూ ఎంజాయ్ చేస్తున్నారు. మధ్య మధ్యలో మా ఇంటి బంగారం తో ఇంకా ఇంకా ట్రావెల్ చేస్తున్నారు. ఇక సమంత ప్రెగ్నెంట్ కావడంతో నటన నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టుగా మా ఇంటి బంగారం సక్సెస్ మీట్ లో ప్రకటించింది.

అయితే సోషల్ మీడియాకి మాత్రం బ్రేక్ ఇవ్వలేదు. స్పెషల్ ఫోటో షూట్స్ తో ఇంకా సందడి చేస్తున్న సమంత ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ కోసం ఓ రియాలిటీ షో కి హోస్ట్ గా చేస్తున్నట్టుగా ఆ సంస్థ ఎపుడో ప్రకటించింది. తాజాగా సమంత హోస్ట్ చేస్తున్న సెలబ్రిటీ మాస్టర్చెఫ్ తమిళ్ ప్రోమో ని వదిలారు.

ఈ రియాలిటీ షో లో సమంత హోస్ట్ గా చేస్తుండగా.. సినీ, టివి, సీరియల్ నటీనటులు కంటెస్టెంట్స్ గా పాల్గొనడమే కాదు ఈ కుకింగ్ షో లో కుకింగ్ ఛాలెంజ్ దానికి మించిన ట్విస్ట్ లు ఉండబోతున్నట్టగా ఈ ప్రోమో చూస్తే తెలుస్తుంది. మరి ఈ రియాలిటీ షో కి హోస్ట్ గా ప్రెగ్నెంట్ సమంత ఎలా హ్యాండిల్ చేస్తుందో వేచి చూడాలి. 
 

Samantha Ruth Prabhu is set to host the Celebrity MasterChef Tamil