ఫౌజీ సర్ ప్రైజ్ అప్ డేట్ అదిరింది
Anupam Kher as Mahatma Gandhi in Fauzi
హను రాఘవపూడి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ చిత్రం దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతుంది. అందుకే ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఫౌజీ నుంచి ఏదైనా అప్ డేట్ వస్తే బావుంటుంది అని ప్రభాస్ ఫ్యాన్స్ చాలా అంటే చాలానే ఆశించారు. కానీ మేకర్స్ సైలెంట్ గా ఉన్నారు, దానితో అభిమానుల్లో నిరాశ తొణికిసలాడింది.
కానీ ఫౌజీ మేకర్స్ సడన్ సర్ ప్రైజ్ ఇస్తూ ఫౌజీ నుంచి అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ అప్ డేట్ అందించారు. ఫౌజీ లో మహాత్మాగాంధీ పాత్రలో బాలీవుడ్ క్రేజీ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తున్నట్టుగా పోస్టర్ వదిలారు. కాకపోతే ఆ లుక్ ని పూర్తిగా రివీల్ చెయ్యలేదు. ప్రభాస్ చేతిలో గన్స్ ఉండగా.. మహాత్మాగాంధీ లుక్ లో అనుపమ్ ఖేర్ అటు తిరిగి ఉన్న ఫౌజీ పోస్టర్ వదిలారు.
ఇక ఈ చిత్రంలో గూఢచారి ఫేమ్ అనీష్ యోహాన్ రవీంద్రనాథ్ ఠాకూర్ రోల్ ప్లే చేస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఈ రెండు కేరెక్టర్స్ ఫౌజీ లో కీలకమైనవిగా తెలుస్తుంది. ఆగష్టు 15 ఫౌజీ సర్ ప్రైజ్ తో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతూ ఆ పోస్టర్ ని షేర్ చేస్తూ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.







































