విశ్వనాథ్ అండ్ సన్స్ - తమిళ్ vs తెలుగు

Vishwanath and Sons - Tamil vs TeluguVishwanath and Sons - Tamil vs Telugu


కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రాన్ని తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి తమిళంలో తెరకెక్కించారు. వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ తో నేషనల్ అవార్డు విన్ అవడంతో ప్రస్తుతం తెలుగులో విశ్వనాథ్ అండ్ సన్స్ పై విపరీతమైన క్రేజ్ ఉంది. మరోపక్క తమిళనాట సూర్య కరుప్పు తో ఫామ్ లోకి వచ్చేసారు.

అందుకే విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం తమిళనాట ఎక్కువ కలెక్షన్స్ తెస్తుందా, లేదంటే తెలుగులో ఎక్కువ కలెక్షన్స్ నమోదు చేస్తుందా అనే విషయంలో ప్రస్తుతం ట్రేడ్ లో జోరుగా చర్చ మొదలైంది. సూర్య కి తెలుగులోనూ క్రేజ్ ఉంది, వెంకీ అట్లూరి ఫస్ట్ టైమ్ తమిళ్ కి వెళ్లారు.

మరి విశ్వనాథ్ అండ్ సన్స్ ని తెలుగు ప్రేక్షకులు ఎక్కువ ఆదరిస్తారో, లేదంటే తమిళ ప్రేక్షకులు ఎక్కువ ఆదరిస్తారో అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గాను, ఇంట్రెస్టింగ్ టాపిక్ గాను మారింది. చూద్దాం ఈ ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ తెలుగు, తమిళ పెరఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో అనేది.

Vishwanath and Sons