జైలర్ 2కి రికార్డ్ ఓటీటీ డీల్

Record OTT deal for Jailer 2Record OTT deal for Jailer 2

 


సూపర్ స్టార్ రజినీకాంత్ ని మళ్లీ ఫామ్ లోకి తీసుకొచ్చిన చిత్రం జైలర్. దానికి సీక్వెల్ గా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న జైలర్ 2 అక్టోబర్ 15 న విడుదలకు సిద్దమవుతుంది. ఈ చిత్రంలో క్రేజీ స్టార్స్ గెస్ట్ రోల్స్ పోషిస్తున్నారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ అంతకు మించి బాలీవుడ్ క్రేజీ స్టార్ హీరో హృతిక్ రోషన్ జైలర్ 2 లో క్యామియో లో కనిపించబోతున్నారు.

దానితో ఈ క్రేజీ మల్టీస్టారర్ పై ట్రేడ్ లో విపరీతమైన క్రేజ్ మొదలైంది. తాజాగా జైలర్ 2 కి రికార్డ్ కాదు కాదు కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీ చరిత్రలోనే భారీ డీల్ జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ జైలర్ ఓటీటీ హక్కులను రూ.160 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.

దీనిని బట్టి తమిళ చిత్రానికి సంబంధించిన అతిపెద్ద ఓటీటీ ఒప్పందాలలో జైలర్ 2 ఒకటిగా నిలిచింది. మరి రజినీకాంత్ కి వరస ప్లాప్స్ ఉన్నప్పటికి ఆయన క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు అని ప్రతి చిత్రము ఓపెనింగ్స్ తో నిరూపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఓటీటీ డీల్ తో సూపర్ స్టార్ స్టామినా మరోసారి ప్రూవ్ అయ్యింది.

Jailer 2 has secured a record-breaking OTT deal worth Rs 160 crore