కనకరాజు కి కష్టమే
Korean Kanakarajuకొరియన్ కనకరాజు చిత్రం తో మెగా హీరో వరుణ్ తేజ్ బౌన్స్ బ్యాక్ అయ్యారు. వరసగా నిరాస పరిచే ఫలితాలతో ఇబ్బందిపడిన వరుణ్ తేజ్ ని కొరియన్ కనకరాజు ఒడ్డున పడేసింది. వరుణ్ తేజ్ మూడు రోజుల్లోనే కొరియన్ కనకరాజు తో బ్రేక్ ఈవెన్ సాధించడం సంచలనం అయ్యింది.
ఇక సోమవారం నుంచి లాభాల బాట పట్టిన కొరియన్ కనకరాజు చిత్రానికి ఈ వారం కష్ట కాలం ఎదురైంది. కొరియన్ కనకరాజు కామెడీగా ఆకట్టుకుంది. కానీ వారానికే కనకరాజు థియేటర్స్ లో సందడి కరువయ్యేలా కనిపిస్తుంది. కారణం ఈరోజు శుక్రవారం విడుదల కాబోతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ పై ఫ్యామిలీ ఫోకస్ పడింది.
సూర్య-వెంకీ అట్లూరి కలయికలో తెరకెక్కిన విశ్వనాథ్ అండ్ సన్స్ కి పాజిటివ్ బజ్ కనిపించడం, ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మాదిరి కనిపించడంతో ఈ చిత్రం పై కుటుంబ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. విశాల్ మకుటం, అగధ, హుషారు పిట్టలు, పళ్ల బరుసు లాంటి చిత్రాలు ఈ వారం విడుదలవుతున్నాయి.
దానితో వరుణ్ తేజ్ సినిమా ఇకపై థియేటర్స్ లో నిలబడడం కష్టమే అనిపిస్తుంది.







































