వెండి తెరపై జయప్రద థర్డ్ ఇన్నింగ్స్!
Jayaprada’s Third Innings on the Silver Screen
దశాబ్దాల పాటు అభినయంతో, అందంతో ప్రేక్షకులను అలరించిన దిగ్గజ నటి జయప్రద మళ్లీ వెండితెరపై మెరవడానికి సిద్ధమవుతున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత జయప్రద `జై హింద్ జై సింధ్` అనే చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ చిత్రంలో జయప్రదను కీలక పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఆమె పరిశ్రమ సహా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టు గురించి దర్శకుడు మాట్లాడుతూ ..కెరీర్‌లో జయప్రద వంటి గొప్ప నటితో పనిచేయడం తో తన కల నిజమవుతుందన్నారు. ఆమె పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుందని, కచ్చితంగా సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జయప్రద నటన, ఆమెలో ఉండే గాంభీర్యం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని యూనిట్ భావిస్తోంది. జయప్రదను వెండితెరపై చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఒకప్పటి స్టార్ హీరోయిన్‌గా తెలుగు, హిందీ ఇతర భాషల్లో సంచలనాలు సృష్టించిన జయప్రద సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎలాంటి వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకుంటారోనని అంతా ఆసక్తిగా చూస్తున్ఆరు. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న నటి తిరిగి రావడం ద్వారా ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడుతుంది. సినిమా స్థాయి కూడా పెరిగింది. ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఒక రకంగా జయప్రదకు ఇది థర్డ్ ఇన్నింగ్స్ లాంటిందని చెప్పొచ్చు. ఎందుకంటే హీరోయిన్ గా వెలిగిన అనంతరం కొంత కాలానికి వివాహం అటుపై మళ్లీ మ్యాకప్ వేసుకోవడం గ్యాప్ ఇవ్వడం జరిగింది. బుల్లి తెర షోలను సైతం హోస్ట్ చేసి సంచలనం సృష్టించారు. అనతరం మళ్లీ విశ్రాంతి తీసుకోవడం తాజాగా రీ ఎంట్రీ ఇవ్వడం ఇంట్రెస్టింగ్.







































