రెండో పెళ్లి ఫొటోల వేళ..నటి పరోక్ష వ్యాఖ్యలు
Urmila Indirect Remark Amid Second Wedding Photos
బాలీవుడ్ నటి ఊర్మిళా మటోండ్కర్ మాజీ భర్త మోహ్సిన్ అక్తర్ రెండో వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ను పంచుకున్నారు. మోహ్సిన్ అక్తర్ తన వివాహానికి సంబంధించిన చిత్రాలను షేర్ చేసిన కొద్దిసేపటికే ఊర్మిళా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పెట్టిన క్రిప్టిక్ నోట్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఆమె పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఆ పోస్ట్‌లో `నాకు ప్రేమ, నమ్మకం , సమయం అంటే చాలా ఇష్టం` అంటూ ఊర్మిళా రాసుకొచ్చారు. జీవితంలో బంధాల పట్ల తనకు ఉండే స్పష్టతను, నిజాయితీని ఉర్మిళ చిన్న మాటల ద్వారా వ్యక్తపరిచారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా నేరుగా తన మనసులోని భావాలను పంచుకోవడం ద్వారా ఆమె మాజీ భర్త పరిణామాలపై పరోక్షంగా స్పందించినట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి.
వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా? ధైర్యంగా ముందుకు సాగుతున్న ఊర్మిళా తీరుకు అభి మానులు మద్దతుగా నిలుస్తున్నారు. కాలం మారుతున్న కొద్దీ సంబంధాలు కూడా మారిపోతున్నాయని అయితే తన ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా ఉర్మిళ ప్రదర్శిస్తున్న సంయమనం స్ఫూర్తిదాయకంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్ బాలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది.







































