డిజప్పాయింట్ మోడ్ లో మహేష్ ఫ్యాన్స్

Mahesh fans are disappointed

 

మహేష్ ఫ్యాన్స్ ఎదురు చూపులకు తగిన ఫలితం దక్కలేదా? రాజమౌళి ఊరించి ఊరించి ఉసూరుమనిపించారా? అదే మహెష్ ఫ్యాన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్. వారాణసి నుంచి మహేష్ బర్త్ డే కి అభిమానులు వీడియో ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసారు. కానీ రాజమౌళి వారణాసి నుంచి రుద్ర కేరెక్టర్ కి సంబందించిన మహేష్ స్పెషల్ స్టిల్స్ వదిలారు.

మార్నింగ్ ఎప్పుడో వారణాసి స్టిల్స్ వచ్చినా మహేష్ అభిమానుల దాహం తీరలేదు. స్టిల్స్ లో రుద్రా గా మహేష్ స్టయిల్ గా కనిపించినా వారికి అసంతృప్తిగానే ఉంది. మహేష్ ని వీడియో గ్లింప్స్ రూపం లో చూడాలనుకుంటే కేవలం ఫొటోస్ వదలడమే వారిని డిజప్పాయింట్ మోడ్ లోకి నెట్టేలా చేసింది.

మరి రాజమౌళి అడిగినా అడగకపోయినా వారణాసి అప్ డేట్స్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మహేష్ ఫాన్స్ అంతగా అడిగినా వారణాసి నుంచి మహేష్ వీడియో ఇవ్వలేదు. అదే అభిమానుల గోల.

Varanasi Treat: Mahesh Fans Left Disappointed?