కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్
Korean Kanakaraju First-Day Collections
నిన్న శుక్రవారం విడుదలైన వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు మూవీ హిట్ కొట్టేసింది. ప్రీమియర్స్ నుంచే కనకరాజు కి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. వరుణ్ తేజ్ పెరఫార్మెన్స్, సత్య కామెడీ వర్కౌట్ అవ్వడమే కాకుండా టెక్నీకల్ గా థమన్ BGM సినిమాని ఎలివేట్ చెయ్యడంలో సక్సెస్ అయ్యింది అంటూ ఆడియన్స్ కనకరాజ్ పై ప్రేమని కురిపిస్తున్నారు.
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్-రితిక నాయక్ నటించిన ఈ చిత్రం మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. మొదటిరోజు కొరియన్ కనకరాజు చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.10.20 కోట్ల గ్రాస్ తీసుకొచ్చినట్లుగా మేకర్స్ అఫీషియల్ పోస్టర్ వేసి కనకరాజు మొదటి రోజు కలెక్షన్స్ ని ప్రకటించారు.
మరి వరుణ్ తేజ్ సినిమాకి మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ పడ్డాయి. కొరియన్ కనకరాజు ఓపెనింగ్స్ కి ప్రీమియర్స్ టాక్ హెల్ప్ అయ్యింది. ఈ వీకెండ్ లో ఈ పాజిటివ్ రెస్పాన్స్ తో కొరియన్ కనకరాజు కి ఇంకా మంచి కలెక్షన్స్ రావడం ఖాయంగా కనిపిస్తుంది.







































