ఏపీ కి క్యూ కడుతున్న హీరోలు

Irumudi Trailer Launch on the 12th

 

ఈమధ్యన సినిమా హీరోస్ చాలామంది ఏపీకి క్యూ కడుతున్నారు. రామ్ చరణ్ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ని విజయవాడలో ప్లాన్ చేసారు. తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు ఈవెంట్ ని భీమవరంలో నిర్వహించారు. ఇక అనకాపల్లి మూవీ టీమ్ ఎక్కువగా వైజాగ్, అనకాపల్లి అంటూ ఏపీలో తిరుగుతుంది.

తాజాగా రవితేజ - శివ నిర్వాణ మూవీ ఈవెంట్ ని ఏపీలోనే ప్లాన్ చేసారు. ఆగష్టు 21 న విడుదల కాబోతున్న ఇరుముడి చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని భీమవరంలోని SRKR ఇంజినీరింగ్ కాలేజ్ లో ప్లాన్ చేసి ఆగష్టు 12 న ఈవెంట్ జరగబోతున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేసారు.

మరి మెల్లగా సినిమా హీరోలు ఏపీ లో సినిమా ప్రమోషన్స్ చేసేందుకు కదులుతున్నారు కానీ.. అక్కడ సినిమా షూటింగ్స్ చేసి సినిమాలు విడుదల చేసే ప్లాన్ ఎప్పుడు చేస్తారో చూడాలి.

Irumudi Trailer Launch on the 12th