ఇండియన్ వంటకాలతో జోనాస్ బ్రదర్స్ రచ్చ

Nick Jonas and Joe Jonas Nick Jonas and Joe Jonas

 


భారతీయ వంటకాలపై పాప్ బ్ర‌ద‌ర్స్ నిక్ జోనాస్- జో జోనాస్కు ఉన్న అభిరుచి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇటీవల ఓ సంగీత కచేరీ పర్యటనలో భాగంగా విదేశాల్లో ఉన్న  అన్నదమ్ములు స్థానికంగా  ప్రసిద్ధ భారతీయ రెస్టారెంట్‌ను సందర్శించారు. అక్కడ వారు ఎంతో ఇష్టంగా ఆరగించిన రుచికరమైన వంటకాలకు సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు తీసుకున్న ఘాటైన ..మధురమైన వంటకాల జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ప్రత్యేకమైన విందులో భాగంగా  రెస్టారెంట్ వారు జోనాస్ బ్రదర్స్ కోసం రాణి కచోరీ, ఉల్లిపాయ భజియా, రాయల్ పిస్తా లాంబ్ చాప్, ముర్గ్ మఖానీ, పాపడ్ కి టోక్రి వంటి అద్భుతమైన వంటకాలను వడ్డించారు. ఈ రుచులను ఆస్వాదిస్తూ తమ భోజనాన్ని ఎంతో ఆనందంగా గడిపారు. ఈ రెస్టారెంట్‌కు వారు రావ‌డం ఇదే తొలిసారి కాద‌ని..గతంలోనూ వచ్చి  నచ్చిన వంటకాలను ఆస్వాదించార‌ని  రెస్టారెంట్ నిర్వాహకులు తెలిపారు.

ఇండియన్ ఫుడ్ అంటే నిక్ జోనాస్‌కు అమితమైన ఇష్టమని.. ముఖ్యంగా పనీర్ వంటకాలు అంటే ఎంతో ప్రియమని పలు సందర్భాల్లో రుజువైంది. బట్టర్ చికెన్, మసాలా పనీర్, బిర్యానీతో పాటు ఆహారంతో పాటు పచ్చడి  ఉండటం తనకు ఎంతో ముఖ్యమని గతంలో పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్నప్పటికీ భారతీయ వంటకాలపై  పాప్ స్టార్స్ చూపుతున్న ఆసక్తి ఇరు దేశాల సంస్కృతుల సమ్మేళనాన్ని మరింత అందంగా ప్రతిబింబిస్తోంది.

Nick Jonas and Joe Jonas can't get enough of Indian food