నాని వాయిస్ పవర్ చాలలేదా?

The Paradise Teaser public talkThe Paradise Teaser public talk

ఎన్నో అంచనాల నడుమ నిన్న గురువారం సాయంత్రం విడుదలైన నాని ప్యారడైజ్ చిత్ర టీజర్ కి అనుకున్న రెస్పాన్స్ రాలేదా? ప్యారడైజ్ టీజర్ అంచనాలు అందుకోలేదా? టీజర్ విడుదలైనప్పుడు గొప్పగా ఉంది అన్నవాళ్ళే ఇప్పుడు విమర్శించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

ప్యారడైజ్ టీజర్ లో నాని లుక్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్ని బావున్నాయి.. కానీ టీజర్ మొత్తం నరకడం, చంపడమే అన్నటుగా ఉంది. అంతేకాదు నాని లుక్స్ కి తగిన డైలాగ్స్ ఉన్నా నాని వాయిస్ లో అంత పవర్ కనిపించలేదు అనేది ఇప్పుడు ప్యారడైజ్ టీజర్ పై వచ్చిన అతి పెద్ద కంప్లైంట్.

నాని చెప్పిన డైలాగ్స్ ని అనిరుద్ BGM డామినేట్ చేసిందా, లేదంటే నాని వాయిస్ అంత డల్ గా ఉందా.. అందుకే డైలాగ్స్ అంత స్పష్టంగా వినిపించలేదా అనే చర్చ మొదలైంది. నాని డబ్బింగ్ అస్సలు సూట్ కాలేదనే మాట వినిపిస్తుంది. అంతేకాకుండా ఇంత వయోలెన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కి ప్యారడైజ్ దూరమవుతుందా అనే వాదన తెరపైకి వచ్చింది.

మరి ఆయా షేర్ లాంటి సాంగ్ విడుదలయ్యాక అంత హైప్ క్రియేట్ చేస్తే, టీజర్ మాత్రం ప్యారడైజ్ పై పూర్తి స్థాయిలో అనుమాలు పెంచేసింది. 

The Paradise Teaser