అప్పుడు ఎంజీఆర్-ఇప్పుడు విజయ్

MGR-JayalalitaMGR-Jayalalita

 

సినీ నటుడిగా రాజకీయాల్లోకి వచ్చి ప్రకంపనలు సృష్టించి సీఎం అయిన ఎంజీఆర్ అప్పట్లో నటి జయలలిత ను ప్రేమించారు. రాజకీయాల్లోకి వచ్చాక జయలలిత ను కూడా ఆయన రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఎక్కువగా జయలలితను పక్కనే పెట్టుకున్నారు. ఎంజీఆర్ మరణం తర్వాత జయలలిత తమిళనాడులో చక్రం తిప్పింది. అప్పట్లో జయలలితను ఎవరైనా ఏమైనా అన్నా, ఆమెను టచ్ చెయ్యాలన్నా ఎంజీఆర్ ని చూసి భయపడేవారు.

ఇప్పుడు అదే మాదిరి తమిళనాడు రాజకీయాలు నటి త్రిష చుట్టూ తీరుతున్నాయి. నటుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చి ఎలెక్షన్ లో పోటీ చేసేటప్పటికి విజయ్-త్రిష డేటింగ్ రూమర్స్ తమిళనాడుకి ఓ ఊపు ఊపేసాయి. విజయ్ భార్యకు విడాకులు ఇవ్వడానికి నటి త్రిష నే కారణం, త్రిష మరో జయలలిత అంటూ మాట్లాడుకున్నారు.

త్రిష కూడా అప్పట్లో జయలలిత మాదిరే విజయ్ చుట్టూ తిరుగుతుంది. అందుకే ప్రతిపక్ష నేతలకు త్రిష టార్గెట్ అయ్యింది. త్రిష గురించి ఇండైరెక్ట్ గా మాట్లాడుతూ టీవీకే ని ట్రిగ్గర్ చేస్తుంది డీఎంకే పార్టీ. విజయ్ ను త్రిష ను టార్గెట్ చేసి మట్లాడుతూ విజయ్ ప్రభుత్వాన్ని ఉడికిస్తుంది.

త్రిష ను ఏమైనా అంటే సహనం కోల్పోయి విజయ్ ప్రభుత్వం డీఎంకే నేతలపై పోలీస్ జులుం చూపించి నవ్వులపాలవుతున్నారు. రీసెంట్ గా ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ని విజయ్-త్రిష వ్యవహారంపై ఇండైరెక్ట్ కామెంట్స్ చేశారన్న కారణంగా ఆయన్ను అరెస్ట్ చేసి వదిలిపెట్టడంతో విజయ్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయింది అంటూ చాలామంది మాట్లాడుకోవడం గమనార్హం. 

Vijay-Trisha