OG 2 వెనక్కి - రోమియో ముందుకు
Nani's Bloody Romeo Latest Updates
ఈమధ్యన పవన్ కళ్యాణ్ OG విషయంలో చేసిన హడావుడితో దర్శకుడు సుజిత్ ముందుగా పవన్ కళ్యాణ్ OG 2 తో సెట్స్ పైకి వెళతారు, నాని తో చెయ్యాల్సిన బ్లడీ రోమియో కూడా పవన్ OG 2 తర్వాతే ప్లాన్ చేస్తున్నారు, నాని ప్యారడైజ్ తర్వాత మరో దర్శకుడితో కమిట్ అవ్వాలి అంటూ ఏవేవో ఊహాగానాలు సోషల్ మీడియాలో నడిచాయి.
కానీ ఇప్పుడు నాని ప్యారడైజ్ షూట్ అవ్వగానే సుజిత్ తో బ్లడీ రోమియో సెట్ పైకి వెళ్ళిపోతారట. పవన్ తో OG షూట్ లేట్ అవడంతో సుజిత్ నాని మూవీ ని మొదలు పెట్టేయ్యాలని రెడీ అవడంతో నాని కూడా సుజిత్ కి డేట్స్ ఇచ్చేసాడు అని తెలుస్తుంది. అక్టోబర్ నుంచి నాని సుజిత్ మూవీలోకి ఎంటర్ అవుతాడట.
మొదటి షెడ్యూల్ ఢిల్లీలో ప్లాన్ చేశారు. ఆతర్వాత లండన్ లో మరో షెడ్యూల్ ని సుజిత్ ప్లాన్ చేసాడు అని, OG 2 ప్రకటనకు ముందే సుజిత్ బ్లడీ రోమియో లొకేషన్స్ కోసమే లండన్ వెళ్ళొచ్చాడని చెబుతున్నారు. అక్టోబర్ లోనే రెగ్యులర్ షూట్ కి నాని బ్లడీ రోమియో వెళుతుంది అని సమాచారం.







































