నిర్మాత‌ల‌కు మైండ్ బ్లాక్ చేస్తోన్న హీరోయిన్లు !

Actresses demands scaring producersActresses demands scaring producers

 

ఒకప్పుడు పరిశ్రమలో  హీరోల డామినేషన్ ఎక్కువగా ఉండేది. కానీ మారుతున్న కాలంతో పాటు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా తమకున్న క్రేజ్ ..మార్కెట్ స్టామినా ఆధారంగా హీరోయిన్లు భారీ డిమాండ్లు చేస్తున్నారు. ఒక్క బ్లాక్‌బస్టర్ హిట్ పడితే చాలు నిర్మాతలు ఊహించని స్థాయిలో హీరోయిన్లు రెమ్యునరేషన్‌ను పెంచి మేకర్స్‌కు మైండ్ బ్లాక్ చేస్తున్నారు.

ఈ జాబితాలో గ్లోబల్ స్టార్స్ ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణే, అలియా భట్‌లతో పాటు సౌత్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు నయనతార, సాయి పల్లవి, రష్మిక మందన్నా ముందు వరుసలో ఉన్నారు. పాన్ ఇండియా లెవెల్‌లో తమకంటూ ప్రత్యేక మార్కెట్‌ను సృష్టించుకున్న నటీమణులు ఇప్పుడు ఏకంగా హీరోలతో సమానంగా పారితోషికాలు అందుకుంటున్నారు. కాల్షీట్లు ఇవ్వడమే కాకుండా లాభాల్లో వాటాలు ..ఇతర డిమాండ్లు చేయ‌డంతో నిర్మాతలు తలలు పట్టుకోవాల్సి వస్తోంది.

కథానాయిక ప్రాధాన్యత ఉన్న చిత్రాలైనా?  లేక స్టార్ హీరోల సరసన కమర్షియల్ ప్రాజెక్ట్‌లైనా?  ఈ భామలు వెనక్కి తగ్గడం లేదు. సినిమా నిర్మాణ వ్యయంలో సగానికి పైగా భాగం  హీరోయిన్ల పారితోషికాలకే కేటాయించాల్సిన పరిస్థితి  పాన్ ఇండియా స్థాయిలో నెలకొంటుంది. బడ్జెట్ అంచనాలు తారుమారువుతున్నా?  థియేటర్లలో  హీరోయిన్ల క్రేజ్ చూశాకే నిర్మాతలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో  డిమాండ్ చేసిన మొత్తాన్ని చెల్లించక తప్పట్లేదు.

ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని పరిశ్రమల్లోనూ ఇదే ధోరణి కొనసాగుతోంది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న  తారలు, నిర్మాతల పరంగా మాత్రం ఆర్థిక సవాళ్లను విసురుతున్నారు. ఈనేప‌థ్యంలో  భవిష్యత్తులో హీరోయిన్ల రెమ్యునరేషన్ ట్రెండ్ సినిమా బడ్జెట్ సమీకరణాలను ఏ విధంగా మారుస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
 

Actresses Remuneration scaring producers