విశ్వంభర - అదవదమ్మా

Vishwambhara release date updateVishwambhara release date update

 

మెగాస్టార్ చిరు బర్త్ డే కి సమయం దగ్గర పడింది. మరో 24 రోజుల్లో మెగాస్టార్ చిరు బర్త్ డే. ఆగష్టు 22 చిరు బర్త్ డే. అప్పటికి అయినా ఆయన నటించిన విశ్వంభర కు విడుదల తేదీ వస్తుందా, అసలు వసిష్ఠ సీజీ వర్క్ కోసం ఎందుకింత టైం తీసుకుంటున్నాడు. చిరు కూడా విశ్వంభర విషయం లైట్ తీసుకుంటున్నారా అనే అనుమానాలు మెగా ఫ్యాన్స్ లో ఉన్నాయి.

ఏడాదిన్నరగా విశ్వంభర విడుదల తేదీపై సోషల్ మీడియాలోనే కాదు మెగా అభిమానుల్లోనూ ఎడతెగని చర్చ నడుస్తుంది. వసిష్ఠ కామ్ గా  విశ్వంభర విడుదల విషయమై ఎలాంటి క్లూ ఇవ్వడం లేదు. మెగా ఫ్యాన్స్ విసిగిపోయి విశ్వంభర విషయాలు పట్టించుకోవడం మానేశారు. విశ్వంభర పై మొదట్లో ఉన్న అంచనాలు లేవు.

చిరు లుక్స్ విషయంలో హ్యాపీగా ఉన్న మెగా ఫ్యాన్స్ విశ్వంభర టీజర్ కొచ్చిన ట్రోల్స్ చూసి టెన్షన్ పడ్డారు. మరోసారి అలా జరగకుండా ఉండాలని వసిష్ఠ టైమ్ తీసుకుంటున్నాడు. అది ఎన్నాళ్ళు, ఎన్నేళ్లు అనేదే తేలని సమస్యగా తయారైంది. 

Vishwambhara