కొరటాల కు మళ్లీ వెయిటింగ్ తప్పేలా లేదు

Koratala Siva NBK 112


కొరటాల కు మళ్లీ వెయిటింగ్ తప్పేలా లేదు. ఇప్పటికే ఎన్టీఆర్ దేవర 2 కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్న కొరటాల శివ ఎన్టీఆర్ తో అవ్వదు అని దేవర 2 ని పక్కనపెట్టి బాలయ్య తో మూవ్ అవుతున్నారు. నందమూరి బాలకృష్ణ తో సినిమా ఓకే చేసుకుని NBK 112 ని స్టార్ట్ కూడా చేసారు. పూజ కార్యక్రమాలతో NBK 112 ని గ్రాండ్ గా మొదలు పెట్టారు.

ఆగస్టు నుంచి NBK 112 రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది, బాలయ్య గోపీచంద్ మలినేని NBK 111 తో పాటుగా కొరటాల మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారని అన్నారు. కానీ ఇప్పుడు బాలయ్య ప్రమాదం బారిన పడి నెల రోజులకు పైనే విశ్రాంతి తీసుకోవల్సి రావడంతో ఆయన చేస్తున్న షూటింగ్ వాయిదా పడింది.

మరి కొరటాల ఎన్టీఆర్ కోసము వెయిట్ చేసి, ఇప్పడు బాలయ్య కోసము వెయిట్ చేసి పాపం కొరటాల. బాలయ్య కోసం ఎలా లేదన్నా మరో రెండుమూడు నెలలు కొరటాలకు వెయిటింగ్ తప్పేలా లేదు.

Koratala Siva -Nandamuri Balakrishna