ప్యారడైజ్ లో మహానటి స్పెషల్
Keerthy Suresh joins the shoot of The Paradise
నాని ది ప్యారడైజ్ చిత్రం రిలీజ్ డేట్ విషయంలో సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది. ఆగష్టు విడుదల అన్న మేకర్స్ ఇప్పుడు సైలెంట్ మోడ్ లో ఉన్నారు. ఈ చిత్రంలో నాని కి జోడిగా కాయదు లోహర్ నటిస్తుంటే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రంలో నాని కి విలన్ గా సీనియర్ హీరో మోహన్ బాబుని దించుతున్నారు.
ప్యారడైజ్ ఐటెం సాంగ్ కోసం పూజ హెగ్డే పేరు వినిపించినప్పటికీ తాజాగా దసరా హీరోయిన్, మహానటి కీర్తి సురేష్ పేరు ప్యారడైజ్ స్పెషల్ సాంగ్ కోసం ఎంపిక చేశారట. దసరా చిత్రంలో నాని కి జోడిగా కీర్తి సురేష్ నటించింది. ఆ చిత్రానికి శ్రీకాంత్ ఓదెలనే డైరెక్టర్. అందుకే కీర్తి సురేష్ ని ప్యారడైజ్ స్పెషల్ కోసం దించుతున్నారని అంటున్నారు.
ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో ఉన్న ఏకైక తెలుగు ప్రాజెక్ట్ అనిల్ రావిపూడి-వెంకీ-కళ్యాణ్ రామ్ మూవీ నే. ఆ మూవీ తప్ప కీర్తి సురేష్ చేతిలో మరో సినిమా లేదు. ఇప్పుడు ప్యారడైజ్ లో స్పెషల్ సాంగ్. ఇలా అయినా కీర్తి సురేష్ కెరీర్ పుంజుకుంటుందేమో చూడాలి.








































