Advertisement

తెలుగు రిలీజ్ లేకుండానే ఓటీటీ రిలీజ్

Gatta Kusthi 2 OTT release details


తమిళనాట విష్ణు విశాల్ లేటెస్ట్ హిట్ మూవీ గట్ట కుస్తీ 2 అక్కడ విజయాన్ని అందుకుంది. థియేటర్స్ లో విడుదలైన రోజు సో సో అన్నప్పటికి.. మెల్లగా కలెక్షన్స్ పుంజుకుని గట్ట కుస్తీ 2 హిట్ మూవీగా నిలిచింది. అయితే గట్ట కుస్తీ అప్పుడు తెలుగులో ప్రమోట్ చేసి విడుదల చేసిన విష్ణు విశాల్, గట్ట కుస్తీ 2 ని మాత్రం తెలుగులో విడుదల చెయ్యలేదు.

అయితే తమిళనాట హిట్ గా నిలిచిన గట్ట కుస్తీ 2 రెండు వారాల్లో తెలుగు రిలీజ్ ఉంటుంది అన్నప్పటికి.. ఇప్పుడు ఇక్కడ టాలీవుడ్ థియేటర్స్ లో విడుదల కాకుండానే గట్ట కుస్తీ 2 ని ఓటీటీ లో స్ట్రీమింగ్ కి తెచ్చేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ నుంచి ఈనెల 31 నుంచి గట్ట కుస్తీ 2 స్ట్రీమింగ్ లోకి రానున్నట్లుగా ప్రకటించారు.

గట్ట కుస్తీ 2 ఐదు లాంగ్వేజెస్ లో ఓటీటీ లో అందుబాటులోకి రానున్నట్లుగా అనౌన్స్ చేసారు. సో తెలుగు రిలీజ్ లేకుండానే గట్ట కుస్తీ 2 డైరెక్ట్ గా ఓటీటీ నుంచి తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
 

Gatta Kusthi 2 hits Netflix on July 30