Advertisement

టాలీవుడ్ హీరోస్ @ హాస్పిటల్స్

Tollywood Heroes @ Hospitals

 

టాలీవుడ్ హీరోలంతా ఇప్పుడు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. సినిమా సెట్స్ లో గాయపడి ఆసుపత్రి పాలై రెస్ట్ లోకి వెళుతున్నారు. గతంలో భుజం నొప్పులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని హాస్పిటల్ పాలు చేసాయి. ఆయన కుడి భుజానికి ముంబై కోకిలబెన్ ఆసుపత్రిలో సర్జరీ జరిగింది. మెగా హీరో వరుణ్ తేజ్ బరి చిత్రం కోసం ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడి రెండు నెలలు విశ్రాంతిలో ఉన్నారు.

ఇక రామ్ చరణ్ కి పెద్ది సెట్ లో జరిగిన ప్రమాదంలో మణికట్టు కు గాయమైంది. దానికి కోయంబత్తూరులోని గంగ ఆసుపత్రిలో సర్జరీ జరిగింది. ఇక నందమూరి హీరోలు బాలకృష్ణ కు NBK 111 సెట్ లో మోకాలికి గాయమవగా దానికి హైదరాబాద్ AIG ఆసుపత్రిలో సర్జరీ జరిగింది.

బాబాయ్ కె కాదు నందమూరి అబ్బాయ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా గాయపడ్డారు. డ్రాగన్ సెట్ లో ఎన్టీఆర్ భుజానికి గాయమవగా ఎనిమిదివారాల రెస్ట్ లో ఆయన ఉంటారని ఎన్టీఆర్ టీం ప్రకటించింది. టాలీవుడ్ హీరోలంతా వన్ బై వన్ అందరూ ఆసుపత్రి పాలవడంతో టైమ్ టు టైమ్ జరగాల్సిన షూటింగ్స్ అన్ని వాయిదాలు పడిపోగా.. వారి వారి అభిమానులు మాత్రం తెగ టెన్షన్ పడుతున్నారు.

Mega and Nandamuri Heroes Are Joined In Hospital