Advertisement

అఖిల్ కి రూ.100 కోట్లు సాధ్యమేనా?

Is Rs 100 crore possible for Akhil?


అఖిల్ లెనిన్ థియేటర్స్ లో సైలెంట్ అయ్యింది. రెండు వారాల పాటు లెనిన్ ప్రభావం థియేటర్స్ లో బాగా కనిపించింది. అఖిల్ లెనిన్ తో రూ.100 కోట్ల క్లబ్బు లోకి ఎంటర్ అవడం పక్కా అని అక్కినేని అభిమానులు ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు మూడో వారం లో లెనిన్ హడావుడి థియేటర్స్ లో కనిపించడం లేదు.

దానితో అక్కినేని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, అలాగే సితార నిర్మాణ సంస్థ ఇంకా లెనిన్ ని ప్రమోట్ చేసి ఉంటే.. అఖిల్ ఖాతాలో రూ.100 కోట్లు సునాయాసంగా వచ్చేవి అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కన లెనిన్ తో అఖిల్ రూ.100 కోట్లు కొట్టగలడా అంటూ సోషల్ మీడియాలో వచ్చే పోస్ట్ లతో వారిని మరింతగా డిస్టర్బ్ చేస్తున్నాయి.

బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ లెనిన్ తో బ్రేక్ ఈవెన్ కొట్టేసాం, ఇక లాభాలే అని రిలాక్స్ అయ్యిపోయారు, అటు నిర్మాతలకు లాభాలు రావడంతో లెనిన్ ని వదిలేసారు. ఇంకాస్త గట్టిగా ప్రమోట్ చేసి ఉంటె లెనిన్ హడావిడి మూడో వారంలోను కనిపించేది. లెనిన్ ని చూద్దామంటే థియేటర్స్ లో సినిమా లేదు అని చాలామంది మాట్లాడుకుంటున్నారు.

ఇది లెనిన్ మేకర్స్ ప్లానింగ్ లేకుండా చేసిన పని. అదే అఖిల్ కి మైనస్ అయ్యింది అంటూ అక్కినేని ఫ్యాన్స్ గోల గోల చేస్తున్నారు.

Akhil Akkinnei - Akhil