Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> NEET Protests Trigger Debate As Tollywood Stars Stay Silent

ఢిల్లీ ఆందోళనలపై టాలీవుడ్ సైలెన్స్

NEET Protests Trigger Debate As Tollywood Stars Stay Silent

 

ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ కి వ్యతిరేఖంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర సీజేపీ ఆందోళన ఉధృతంగా మారింది. విద్యార్థులు వానను, ఎండను లెక్క చెయ్యకుండా రోడ్డుపై నిరసిస్తున్నారు. కాక్రోచ్‌ జనతా పార్టీ పార్లమెంట్‌ ముట్టడికి ప్రయత్నిస్తోంది. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా కోసం యువత పట్టుబడుతోంది.

విద్యార్థుల ఆందోళనల మద్యన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ స్టూడెంట్ ప్రొటెస్ట్ కు మద్దతుగా నిలిచారు. ఈమొత్తం వ్యవహారంలో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అతి తక్కువమంది విద్యార్థుల కు సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఆందోళనలు మొదలైన మూడు రోజులు మలయాళ, బాలీవుడ్ సినిమా స్టార్స్ సీజేపీ కి సపోర్ట్ గా ట్వీట్లు వేస్తున్నారు.

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో మీడియా, సోషల్ మీడియా హోరెత్తిపోతుంటే టాలీవుడ్ మాత్రం మొద్దు నిద్రలో ఉంది. టాలీవుడ్ నుంచి ఏ ఒక్క స్టార్ కూడా సీజేపీకి మద్దతుగా ఒక్క ట్వీట్ చెయ్యకపోవడం గమనార్హం. టాలీవుడ్ ప్రముఖులెవరూ సీజేపీకి మద్దతుగా ఒక్క ట్వీట్ వెయ్యకపోవడంపై సెటైర్స్ స్టార్ట్ అయ్యాయి.

Why Tollywood Remains Silent About NEET Protest