మలయాళ పి ఆర్ పై జోజు జార్జ్ సెన్సేషనల్ కామెంట్స్
Joju George claims leading actor and wife ran PR
ఈమధ్యన బాలీవుడ్ పీఆర్ వ్యవస్థ పై రకుల్ ప్రీత్ చేసిన కామెంట్స్ వైరల్ అయిన తరుణంలో మలయాళ స్టార్ నటుడు జోజు జార్జ్ మలయాళ పిఆర్ వ్యవస్థ, అలాగే ఓ స్టార్ దంపతులపై చేసిన కామెంట్స్ హాట్ హాట్ గా చక్కర్లు కొడుతున్నాయి. జోజు జార్జ్ తన కొత్త చిత్రం వరవ్ ప్రమోషన్స్ లో భాగంగా మలయాళ పిఆర్ సంస్థపై ఈ వ్యాఖ్యలు చేసారు.
తన సినిమాని తొక్కేయాలని కొందరు పనిగట్టుకుని ఉన్నారు, అందులో మలయాళంలో ప్రముఖ స్టార్ నటుడు, ఆయన భార్య పీఆర్ సంస్థకు డబ్బులిచ్చి మరీ నా సినిమాకి నెగెటివ్ గా వ్యతిరేఖంగా ప్రచారం చేస్తున్నారు.. అంటూ వాళ్ళ పేర్లు జోజు జార్జ్ బయటపెట్టకపోయినా ఇప్పుడు జోజు జార్జ్ చేసిన వ్యాఖ్యలు మలయాళ ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
జోజు జార్జ్ ఆరోపణలు చేస్తున్న ఆ స్టార్ జంట ఎవరై ఉంటారా అని సోషల్ మీడియాలో అప్పుడే రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చేసాయి.
Joju George accuses leading actor and wife








































