జన నాయగన్ విడుదల ఆగినా బావుండేది 

Jana Nayagan Public TalkJana Nayagan Public Talk


విజయ్ లాస్ట్ చిత్రంగా విడుదల కావాల్సిన జన నాయగన్ చిత్రం ఈ ఏడాది జనవరి 9 న రావాల్సింది. కానీ సెన్సార్ ప్రోబ్లెంస్ తో గత ఏడు నెలలుగా సినిమా విడుదల కాలేదు. ఆగి ఆగి జులై 23 న విడుదలైంది. విజయ్ ఫ్యాన్స్ ఎంతో హోప్స్ పెట్టుకున్న జన నాయగన్ చిత్రం హిట్ చేసి విజయ్ కి మరిచిపోలేని హిట్ ఇవ్వాలని విజయ్ ఫ్యాన్స్ భావించారు.

కానీ జన నాయగన్ ఆ రేంజ్ లో లేదు. భగవంత్ కేసరి చిత్రంలోని 50 శాతం మాత్రమే రీమేక్ చేశామని చెప్పిన దర్శకుడు.. అసలు జన నాయగన్ తీసి భగవంత్ కేసరి పరువు పోగొట్టారు. భగవంత్ కేసరి ని చెడగొట్టారు. విలన్ కేరెక్టర్ ని చెండాలంగా చూపించారు. క్లైమాక్స్ ని కామెడీ చేసారు అంటూ జన నాయగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

విజయ్ ఫ్యాన్స్ కే జన నాయగన్ నచ్చలేదు అంటే ఆ సినిమా ఎలా ఉందొ అర్థవుతుంది. ఈ వీకెండ్ లో జన నాయగన్ తమిళనాట బుకింగ్స్ బాగానే ఉన్నా మిగతా తెలుగు, హిందీ భాషల్లో మాత్రం జన నాయగన్ మొదటిరోజుకే వీకైపోయింది. కొంతమంది ఇలాంటి సినిమా విడుదలై విమర్శలు పొందడం కన్నా విడుదలవ్వకుండా ఉంటె బావుండేది అంటూ మాట్లాడుకోవటం గమనార్హం.

Jana Nayagan Social Media Talk