చిన్న రోల్ అయినా ఎఫెక్ట్ ఎఫక్టే

Jana Nayagan Public ReviewJana Nayagan Public Review

 

పూజ హెగ్డే కి మరో నిరాశపరిచే ఫలితం ఎదురైంది. తమిళ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పూజ హెగ్డేకి ఆ రీ ఎంట్రీ షాక్ ఇచ్చింది. వరస సినిమాలు ప్లాప్ అవడంతో పూజ హెగ్డే, విజయ్ తో నటించిన జన నాయగన్ పై చాలా హోప్స్ పెట్టుకుంది. కానీ సినిమాలో పూజ హెగ్డే రోల్ ట్రిమ్ చేసినట్టుగా దర్శకుడు స్వయంగా పూజ హెగ్డే కి షాకిచ్చాడు.

ఇక జన నాయగన్ బ్లాక్ బస్టర్ అవుతుంది, అందులో చిన్న పాత్రే అయినా పూజ హెగ్డే కి జన నాయగన్ హిట్ కలిసొస్తుంది అనుకుంటే.. ఈరోజు జులై 23 న విడుదలైన జన నాయగన్ కు తెలుగులోనే కాదు, హిందీలోనూ పూర్ రివ్యూస్ రాగా.. తమిళనాట కూడా జస్ట్ యావరేజ్ టాక్ రావడం విజయ్ ఫ్యాన్స్ కన్నా ఎక్కువగా పూజ హెగ్డే కి షాకిచ్చింది.

జన నాయగన్ లో పూజ హెగ్డే పాత్ర నిడివి తక్కువే అయినా జన నాయగన్ రిజల్ట్ ఎఫెక్ట్ కచ్చితంగా పూజ హెగ్డే పై పడుతుది అని ఆమె అభిమానులు అందోళన పడుతున్నారు.  

Pooaj Hegde