Advertisement

చెన్నై లవ్ స్టోరీ ప్రీమియర్స్ టాక్

Chennai Love Story Premiere Talk


కిరణ్ అబ్బవరం హీరోగా రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన చెన్నై లవ్ స్టోరీ లో బేబీ దర్శకుడు సాయి రాజేష్ కూడా భాగమవడంతో మరో బేబీ లాంటి హిట్టు పడుతుంది అని ప్రేక్షకులు బలంగా నమ్మేలా ప్రమోషన్స్ నిర్వహించారు. సినిమా లో నటుడిగా కష్టపడడమే కాదు ప్రమోషన్స్ లోను కిరణ్ అబ్బవరం చాలా కష్టపడ్డాడు.

చెన్నై లవ్ స్టోరీపై నమ్మకంతో మేకర్స్ ఒకరోజు ముందే ప్రీమియర్స్ వేశారు. చెన్నై లవ్ స్టోరీ ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ స్పందనను తెలుపుతున్నారు. కిరణ్ అబ్బవరం యాక్టింగ్ లో కెరీర్ బెస్ట్ ఇచ్చాడని, ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, ఫస్ట్ హాఫ్ లోని ఎమోషన్స్, మణిశర్మ మ్యూజిక్ సినిమాకి ప్రధానమైన బలాలు.

సినిమాలో సెకండ్ హాఫ్ వీక్, ఊహలకందే సన్నివేశాలు, స్క్రీన్ ప్లే, రిపీటెడ్ సీన్స్ ఇబ్బంది పెడతాయి. ఓవరాల్ గా సినిమా బావుంది, కిరణ్ అబ్బవరం కష్టం సినిమా తెరపై కనిపిస్తుంది. కిరణ్ కోసం చెన్నై లవ్ స్టోరీ చూడాల్సిందే.
 

Chennai Love Story Social Media Talk