సల్మాన్ ఖాన్ కి ఏమైంది? ఎందుకంత నీరసంగా!
Salman Khan debuts unrecognisable new lookసల్మాన్ ఖాన్ తాజా లుక్ చూసి ఒక్కసారిగా అంతా స్టన్ అయిన సంగతి తెలిసిందే. ఎంతో ఎనర్జిటిక్‌గా, ఫిట్‌గా కనిపించే సల్మాన్ నీరసంగా , అలసటతో కనిపించడం ఆందోళనకు గురి చేస్తోంది. సల్మాన్ ముఖంలో స్పష్టమైన మార్పులు ఉండటం, నడకలో తెలియని భారం చూసి అభిమానులు ఏమైందంటూ ఆదోళన చెందుతున్నారు.
గతంలో ఎప్పుడూ చూడని విధంగా సల్మాన్ ఇలా కనిపించడం పట్ల అంతా ఆశ్చర్యపోతున్నారు. దీంతో
ఈ మార్పుకు ప్రధాన కారణం ఏదైనా? కొత్త సినిమా కోసం చేస్తున్న మేకోవరా? లేక మరేదైనా ఆరోగ్య సమస్యనా? అనే చర్చ బాలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. సాధారణంగా సల్మాన్ ఖాన్ తన చిత్రాల కోసం విభిన్నమైన లుక్స్ ట్రై చేస్తూ ఉంటారు.
కానీ తాజా లుక్ చూస్తే అలా కనిపించలేదు. అనారోగ్యానికి గురైన వ్యక్తిలా కనిపించడంతో సినిమా లుక్ ఎలా అవుతుందని చాలా మంది అంగీకరించడం లేదు. మరొక వర్గం మాత్రం సల్మాన్ వయసు రీత్యా లేదా పని ఒత్తిడి వల్ల కలిగిన అలసట కావచ్చని అభిప్రాయపడుతోంది. అయితే ఇంత వరకు సల్మాన్ ఖాన్ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
కారణాలు ఏవైనా? అభిమానుల పట్ల ఎంతో కేరింగ్ తీసుకునే సల్మాన్ ఖాన్ తన ఆరోగ్యంపై స్పష్టత ఇస్తే తప్ప మీడియా ఊహాగానాలకు తెరపడదు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటించిన మాతృభూమి రిలీజ్ కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ చైనా-భారత్ సత్ససంబంధాల నేపత్యంలో రిలీజ్ పై కేంద్రమే అడ్డు పుల్లగా మారింది. అక్కడ నుంచి క్లియరెన్స్ వస్తే తప్ప సినిమా విడుదలవ్వదు.







































