శ్రీలీల రిబ్బన్ కటింగ్స్ వెనుక సీక్రెట్
Sreeleela Opens About Why She Is Participates In Shop Openings
టాలీవుడ్ లోకి పెళ్లి సందD చిత్రం తో ఎంటర్ అయ్యి వరస ఆఫర్స్ పట్టుకుని తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన శ్రీలీల తమిళ, హిందీ సినిమాలతోను ఫుల్ బిజీ. తెలుగులో అమ్మడు హవా తగ్గినా ఆమెకు షాప్ ఓపినింగ్స్ ఆఫర్స్ మాత్రం భీభత్సంగా వచ్చిపడుతున్నాయి. అటు సినిమాలు, ఇటు రిబ్బన్ కటింగ్స్ తో శ్రీలీల రెండు చేతులా సంపాదిస్తుంది.
అయితే ఎక్కువగా శ్రీలీల షాప్ ఓపినింగ్స్ కి ఎందుకు వెళుతుంది అంటే.. ఆమెకు అభిమానులను ప్రత్యక్షం కలవడం చాలా ఇష్టమట. అందుకే తాను షాప్ ఓపినింగ్స్ ని ఇష్టపడతాను అని, అభిమానులను కలిసి వారి ప్రేమను అభిమానం పొందడం నిజంగా వరం అంటూ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం శ్రీలీల చేతిలో తెలుగు ప్రాజెక్ట్స్ ఏమి లేవు కానీ.. తమిళంలోనూ, హిందీలోనూ శ్రీలీల క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తుంది.
Sreeleela







































