వెకేషన్ తర్వాత సమంత సింపుల్ సీమంతం

Samantha baby shower Photos


సమంత నటించిన మా ఇంటి బంగారం మూవీ రూ.100 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టడమే కాదు.. ఇప్పుడు ఈ రూ.100 కోట్ల చిత్రం ఓటీటీ లోకి ఎంటర్ అయ్యింది. మా ఇంటి బంగారం ఈరోజు నుంచే జియో హాట్ స్టార్ నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. అయితే ఈ రూ.100 కోట్ల సంతోషాన్ని, అలాగే అమ్మతనాన్ని సమంత తన భర్త తో కలిసి థాయ్ ల్యాండ్ వెకేషన్ లో ఆస్వాదిస్తోంది.

రాజ్ నిడిమోరు తో కలిసి బేబీ మూన్ వెకేషన్ అంటూ థాయ్ ల్యాండ్ లో బేబీ బంప్ తో సందడి చేసినా సమంత ఆతర్వాత తన అత్తారింటికి వచ్చింది. చిత్తూరులో ఉంటున్న రాజ్ నిడిమోరు తల్లితండ్రుల దగ్గరకు వచ్చిన సమంత కు అత్తారింట సింపుల్ గా సీమంతం వేడుకలు జరిపించారు అత్తమామలు.

భార్య-భర్తల మెడలో పూల మాలలు వేసి.. సమంత ఒడిలో చీర, సారె పెట్టిన ఫొటోస్ ను రాజ్ సోదరి శీతల్ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేయగా అవి కాస్త ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Samantha Ruth Prabhu celebrates intimate baby shower with Raj Nidimoru