మహేష్-రాజమౌళికి ఇది పెద్ద పరీక్షే!
Big Test For Mahesh and Rajamouli
సూపర్ స్టార్ మహేష్ - రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ `వారణాసి`పై ఎలాంటి అంచనాలున్నాయో చెప్పాల్సిన పనిలేదు. అన్ని పనులు పూర్తిచేసుకుని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేయడానికి యూనిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది అక్టోబరు కల్లా షూటింగ్‌ను పూర్తి చేసే లక్ష్యంతో రాజమౌళి శరవేగంగా పనులు ముగిస్తున్నారు. అయితే విజువల్ వండర్‌గా రూపొందుతున్న సినిమాకు గ్లోబల్ స్థాయిలో ఊహించని సవాళ్లు ఎదురవుతున్నాయి.
ప్రధానంగా ఐమ్యాక్స్ .. ప్రీమియం లార్జ్ ఫార్మాట్ స్క్రీన్లను లక్ష్యంగా చేసుకున్న `వారణాసి`కి అదే సమయంలో హాలీవుడ్ చిత్రాల నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. `గాడ్జిల్లా x కాంగ్: సూపర్‌నోవా` వంటి భారీ బడ్జెట్ హాలీవుడ్ సినిమా థియేటర్లలో రన్ అవుతుండటం.. అదే సమయంలో `పానిక్ కేర్‌ఫుల్లీ` అనే మరో క్రేజీ ప్రాజెక్ట్ విడుదలకు సిద్ధమవ్వడం ఇండియన్ సినిమాకి ఆందోళన కలిగిస్తోంది. ప్రీమియం స్క్రీన్లను హాలీవుడ్ సంస్థలు నెలల ముందే బుక్ చేసుకోవడం వల్ల గ్లోబల్ మార్కెట్‌లో `వారణాసి`కి అనువైన థియేటర్లను దక్కించుకోవడం పెద్ద పరీక్షగా మారనుంది.
ఇలాంటి పోటీ వాతావరణంలో రాజమౌళి మేకింగ్ స్టైల్ ..కంటెంట్ బలంపైనే ఆశలు పెట్టుకోవాల్సి ఉంటుంది. భారీ హాలీవుడ్ చిత్రాల మధ్య ఇండియన్ సినిమా ప్రభావాన్ని ఎలా చూపుతుందనేది? ఆసక్తికరమైన అంశంగా మారింది. అంతర్జాతీయ స్థాయి బాక్సాఫీస్ క్లాష్‌ను ఎదుర్కొంటూ ఐమ్యాక్స్ స్క్రీన్లను ఎలా మేనేజ్ చేస్తారు? ఆ క్లిష్ట పరిస్థితుల్లో వారణాసి స్థానాన్ని ఎలా సుస్థిరం చేసుకుంటుందనేది? చూడాలి.







































