విజయ్ ఫ్యాన్స్ కు ఒకరోజు ముందే పండగ
Jana Nayagan preponed
కోలీవుడ్ స్టార్ హీరో కం సీఎం విజయ్ నటించిన చివరి చిత్రం జన నాయగన్ కు మోక్షం దొరికింది. జులై 24 న సినిమా విడుదలకు రెడీ అవుతుంది. జన నాయగన్ చిత్రం వాయిదాపడిన ఆరు నెలలకు సెన్సార్ క్లియరెన్స్ లభించడంతో జన నాయగన్ విడుదలకు మేకర్స్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అయితే జులై 24 కాదు ఒకరోజు ముందే జూన్ 23 నే జన నాయగన్ విడుదల అంటూ జన నాయగన్ నిర్మాత, విజయ్ పీఎస్ జగదీష్ పలని స్వామి కన్ఫర్మ్ చేసేసారు. మరి ఇప్పటివరకు చాలా వెయిట్ చేస్తున్న విజయ్ ఫ్యాన్స్ కు ఇది పండగ లాంటి వార్తే కదా.. ఆరు నెలలుగా జన నాయగన్ కోసం విజయ్ ఫ్యాన్స్ వెయిటింగ్.
ఆరు నెలలుగా దొరకని మోక్షం ఇప్పుడు జులై 23 కి దొరకబోతుంది. అందుకే విజయ్ ఫ్యాన్స్ ఇప్పటికే సంబరపడిపోతున్నారు. ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా కనిపించగా, హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు.
Jana Nayagan arriving one day earlier







































