రేర్ ఫీట్ సాధించిన సమంత

Samantha enters 100 cr club

 

పేరున్న హీరోలకు కూడా సాధ్యపడని రేర్ ఫీట్ ని హీరోయిన్ సమంత సాధించింది. ఆమె లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం అఫీషియల్ గా రూ.100 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టింది. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత లీడ్ రోల్ లో తెరకెక్కిన మా ఇంటి బంగారం మూడు వారాలకు గాను రూ.100 కోట్లు గ్రాస్ కొల్లగొట్టినట్టుగా మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.

చాలామంది హీరోల కలను సమంత సునాయాసంగా సాధించేసింది. జూన్ 19 న మా ఇంటి బంగారం విడుదలైన తర్వాత పాజిటివ్ టాక్ చూసి రూ.50 కోట్లు వస్తాయనుకుంటే.. మూడు వారాలు ఫినిష్ అయ్యి నాలుగో వారంలో వీకెండ్ ముగియకుండానే బంగారం రూ.100 కోట్ల క్లబ్బులోకి చేరిపోయి అందరిని ఆశ్చర్యపరిచింది.

అసలు అఖిల్ లెనిన్ సమంత రూ.100 కోట్ల క్లబ్బు కలను చెరిపేస్తుంది అనుకున్నారు. కానీ సమంత మా ఇంటి బంగారం తో రేర్ ఫీట్ ని సాధించి ఊహలకందని కలను నెరవేర్చుకుంది. అన్నట్టు మా ఇంటి బంగారానికి సీక్వెల్ కూడా అనౌన్స్ చేసారు. 

Samantha Maa Inti Bangaram enters 100 cr club