సుకుమార్ పర్ఫెక్షన్ వేటలో ఆలస్యం!

Director Sukumar

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కాంబినేష‌న్ లో `ఆర్సీ 17` కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. `రంగస్థలం` వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఇద్ద‌ర‌కి  కాంబినేషన్ అనగానే అంచనాలు ఆకాశ‌న్నంటుతున్నాయి. అయితే షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా?  ఇప్పటికీ సెట్స్‌పైకి వెళ్లకపోవడం వెనుక సుకుమార్ శైలియే కారణమని ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. కథ విషయంలో చిన్న చిన్న మార్పులు చేస్తూ తనదైన శైలిలో పర్ఫెక్షన్ కోసం సుకుమార్ పడే తపన  ప్రాజెక్టును  ఆలస్యం చేస్తోందని సమాచారం.

సుకుమార్ విషయానికి వస్తే  స్క్రిప్ట్ విషయంలో ఏమాత్రం రాజీ పడకపోవడం అలవాటే. ప్రతి సన్నివేశాన్ని,  పాత్రను అత్యంత లోతుగా పరిశీలించి మలచడం ఆయన పద్ధతి. రామ్ చరణ్ సిద్ధంగా ఉన్నా? సుకుమార్ మాత్రం కథను ఫైనల్ చేసే విషయంలో ఎలాంటి తొందరపాటుకు లోనవ్వడం లేదు. ఇటీవల రామ్ చరణ్   గాయం కారణంగా విశ్రాంతిలో ఉండటం కూడా సుకుమార్ కు అదనపు సమయాన్ని ఇచ్చింది. సుకుమార్ ఈ సమయాన్ని స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దేందుకు వాడుకుంటున్నారు.

ఏది ఏమైనా? ఆలస్యం వెనుక ఉన్న కారణం నాణ్యత కాబట్టి అభిమానులు కూడా ఓపికగానే ఎదురుచూస్తున్నారు. సుకుమార్ మార్క్ మేకింగ్‌లో సినిమా వస్తే ఆ ఫలితం ఎలా ఉంటుందో `పుష్ప` సిరీస్ నిరూపించింది. తాజాగా రామ్ చరణ్ కోసం  అల్లుతున్న కథ, ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకుంటుందనేది? ఆసక్తికరం. దసరా పండుగ‌ తర్వాత షూటింగ్ ప్రారంభమ‌వుతుంద‌ని  ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో వాస్త‌వం తెలియాల్సి ఉంది.

RC17