హీరో ఆర్య పై చీటింగ్ కేసు

Cheating case against actor AryaCheating case against actor Arya

 

తమిళ హీరో ఆర్య పై కేసు నమోదు అయ్యింది. హీరో ఆర్య తో పాటు ఆయన నటించిన మలయాళ చిత్రం అనంతన్ కాడు నిర్మాతలపై హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. కారణం అనంతన్ కాడు చిత్రం షూటింగ్ నిమిత్తం అద్దెకు తీసుకున్న వస్తువులకు బకాయిలు చెల్లించలేదని కేసు వేశారు.

తాహెర్ సినీ టెక్నిక్సంస్థ అకౌంటెంట్ జావేద్ అలీ ఆర్య ఇంకా ఆ చిత్ర బృందం తమకు రూ.1.80 కోట్లకు బకాయిలు చెల్లించలేదని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. హీరో ఆర్య, నిర్మాత వినోద్ తమ సంస్థను సినిమా షూటింగ్ కి కావాల్సిన వస్తువుల కోసం వచ్చారని..

సినిమాకి కావాల్సిన ఖరీదైన కెమెరాలు, లైటింగ్ యూనిట్లను హైదరాబాద్ నుంచి కేరళకు తరలించామని, షూటింగ్ తర్వాత తమ దగ్గర తీసుకున్న వస్తువులు అప్పగించినప్పటికీ, చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ వారు జూబ్లీహిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. మరి ఈకేసుపై హీరో ఆర్య ఇతరలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Cheating Case Filed Against Actor Arya in Hyderabad